Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం

  • 63 ఓట్లు సాధించిన ఎంఐఎం అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హాసన్.
  • బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు.

ముద్ర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్‌ హాసన్‌ 63 ఓట్లు సాధించి, తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు (25 ఓట్లు)పై భారీ ఆధిక్యంతో గెలుపొందారు.ఈ ఎన్నికల్లో మొత్తం 78.57 శాతం పోలింగ్ నమోదైంది.మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్-అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు పోలింగ్‌లో పాల్గొన్నారు.అయితే బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు,ఎక్స్-అఫీషియో సభ్యులు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. బీజేపీ క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకున్నప్పటికీ, అలాంటిదేమీ జరగకపోవడంతో ఓటమిని చవిచూసింది.

Leave A Reply

Your email address will not be published.