ముద్ర పెబ్బేర్
శ్రీరంగాపూర్ మండల పరిధిలోని వెంకటాపూర్ చౌరస్తానందు స్థానిక ఎస్సై హిమబిందు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. అనంతరం వాహనదారులకు రోడ్డు భద్రతలపై, సైబర్ నేరగాళ్ల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరు హెల్మెంట్ తప్పనిసరిగా వాడాలని ఆమె హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని, అలాగే వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అలాగే ఎవరైనా తెలియని వ్యక్తులు ఫోన్ మేము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాము అని ఓటిపి చెప్పమని అడిగితే నేరుగా బ్యాంకు కి వెళ్లాలని ఓటిపి చెప్పవద్దని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శివరామ్, హుస్సేన్, భగీరథ తదితరులు పాల్గొన్నారు.