- స్వామీజీ బోధనలు ఎల్లప్పుడూ అనుసరణీయం
ముద్ర, మెహిదీపట్నం: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మెహదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ కాలనీలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జి అప్పారావు, జగన్మోహన్ రెడ్డి, అంజిరెడ్డి, ఏ కృష్ణమూర్తి, టీఎస్ ఆనంద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, వై నరేందర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ స్ఫూర్తిదాయకమైన స్వామి వివేకానంద బోధనలు ఎల్లప్పుడూ అనుసరణీయమని అన్నారు.
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని అమలుకు నిర్విరామంగా కృషి చేయాలన్న వివేకానందుని బోధనలను అందరూ ఆచరించాలని వారు సూచించారు. యువజనులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తమ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని అన్నారు. అంతకుముందు వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మురళీమోహన్, సురేందర్, కృష్ణ దాస్, ఎల్ దామోదర్, సంజీవరెడ్డి, రమణ, గఫూర్ తదితరులు పాల్గొన్నారు.