ముద్ర,మోత్కూర్:
మోత్కూర్ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆర్యవైశ్య సంఘం మండల నూతన అధ్యక్షులు ఇరుకుల వెంకన్న అన్నారు. ఆదివారం స్థానిక ఆర్యవైశ్య సంఘం భవనంలో పట్టణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మొగుళ్ల పెళ్లి సోమయ్య గత ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి, సంఘం లావాదేవీలు, నిర్వహించిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న పాల్గొని మాట్లాడుతూ సమాజంలో మన సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని కోరారు. అనంతరం పట్టణ సంఘం నూతన కమిటీని మండల అధ్యక్షులు ఇరుకుల వెంకన్న ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. పట్టణ సంఘం అధ్యక్షునిగా మొగుళ్ళపల్లి సోమయ్య గారిని తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా బండారు రాజేంద్రప్రసాద్, కోశాధికారిగా మురారి శెట్టి శ్రీధర్ , వ పిఆర్వో గా బద్ది శెట్టి సంతోష్, ఉపాధ్యక్షులుగా బుక్క విశ్వనాథం,సోమ లింగయ్య,అనంతల అశోక్, కార్యదర్శులుగా బుక్క చంద్రశేఖర్, ఇమ్మడి రమేష్, పందిరి వెంకన్న, గౌరవ సలహాదారులుగా బుస్స శ్రీనివాస్, మిట్టపల్లి నాగేష్, గౌరు శ్రీనివాస్,సోమ నర్సయ్య, అనంతుల వెంకటయ్య, పల్లెర్ల వెంకన్న ,కార్యవర్గ సభ్యులుగా మాశెట్టి వెంకన్న, సోమ కార్తీక్ ,రాపాక శంకర్, సోమ కిరణ్ ,ఇమ్మడి వినోద్, తోనుపునూరి చంద్రశేఖర్ ,అల్లాడి సోమేశ్వర్ లను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మొగుళ్ళపల్లి సోమయ్య మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి ఎల్లవేళలా పాటుపడతానని తెలిపారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాననీ అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సోమ వెంకటేశ్వర్లు , సోమ సంతోష్, తిపిరిశెట్టి శ్రీనివాస్, గౌరు చంద్రశేఖర్, మండల కార్యదర్శి గుండా రాములు తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.