Take a fresh look at your lifestyle.

స్నేహితురాలి కుటుంబానికి తోటి స్నేహితుల ఆర్థిక సహాయం.

ముద్ర, మోత్కూర్:

స్నేహితురాలి కుటుంబానికి తమ వంతు ఆర్థిక సాయంగా  2006 2007 సంవత్సరం 10వ తరగతి విశ్వభా రతి ఉన్నత పాఠశాల మోత్కూర్ పూర్వ విద్యార్థులు కలిసి మమ్మద్ బిపాషా భర్త రహీం అకాల మృతి చెందడంతో మిగతా తరగతి స్నేహితులు అందరూ కలిసి 40 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. తమతోపాటు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన స్నేహితురాలు భర్తను కోల్పోవడంతో మిగతా స్నేహితులందరూ కలిసి వారి కుటుంబాన్ని ఓదార్చి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వ భారతి పూర్వ ఉపాధ్యాయుడు బయ్యని రాజు, తొట్ల నరేష్, కంసాని రాజిరెడ్డి, అంబటి శ్రీకాంత్, వనం మహేష్, శ్రీకాంత్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, పరశురాములు, దండవేణి మంజుల, గంగుల ప్రియాంక, నిలిగొండ భాగ్యలక్ష్మి, వంగ సంధ్య, మామిడి ఉష, హేమలత, స్వప్న, లోడంగి జ్యోతి, ఎండి బి పాషా తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.