ముద్ర : మల్కాజిగిరి
తెలంగాణ పోలీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేగంపేటలో ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంక్‌ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శివధర్ రెడ్డి, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీ అవినాష్ మహంతి, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ ఐజీపీ గజరావు భూపాల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఈ ఫ్యూయల్ స్టేషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పోలీస్ సిబ్బంది సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఇంధనాన్ని అందించే లక్ష్యంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఏప్రిల్ 1, 2026 నుండి ఈ పెట్రోల్ బంక్ సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.