Take a fresh look at your lifestyle.

ఉప్పల్ కారిడార్ కు రాజిరెడ్డి పేరు పెట్టడం పై రాజకీయ వివాదం

 

ముద్ర : కాప్రా

ఉప్పల్‌లో నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్‌కు మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది.
ఈ నిర్ణయాన్ని బీజేపీ నాయకులు వ్యతిరేకించడంపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద శ్రీ బండారి రాజిరెడ్డి ఎలివేటెడ్ కారిడార్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి
లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, రాజిరెడ్డి ఉప్పల్ తొలి ఎమ్మెల్యేగా, కాప్రా మున్సిపల్ చైర్మన్‌గా చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. సుమారు రూ.350 కోట్లు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అందించిందని, నిర్మాణంలో ఉన్న ఈ ఎలివేటెడ్ కారిడార్ ఈ ప్రాంత అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ విమర్శలు చేయడం ఆయన అవగాహన లోపాన్ని సూచిస్తుందని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో, ప్రజా ప్రతినిధుల పేర్లను ప్రజా ప్రాజెక్టులకు పెట్టే విషయంలో పారదర్శకత, ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాజకీయంగా చూస్తుంటే మరోవైపు అధికార పార్టీ మాత్రం అభివృద్ధి కార్యక్రమాల్లో సేవలందించిన నాయకులను గౌరవించడం సహజమని సమర్థిస్తోంది.
రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న తమ కుటుంబంపై విమర్శలు చేస్తే ప్రజలు తగిన విధంగా స్పందిస్తారని లక్ష్మారెడ్డి హెచ్చరించడం రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

మొత్తంగా, ఒక అభివృద్ధి ప్రాజెక్టుకు పేరు పెట్టడంపై ప్రారంభమైన ఈ వివాదం, స్థానిక రాజకీయాల్లో మరింత చర్చకు దారితీస్తోంది.

ఉప్పల్ రహదారి కి మాజీ ప్రధాని వాజపేయి పేరు పెట్టాలి-బిజెపి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఉప్పల్ నారపల్లె ఎలివేటెడ్ కారిడార్ కు భారత మాజీ ప్రధాని దివంగత అటల్ బీహార్ వాజపేయి పేరు నామకరణ చేయాలని రాష్ట్ర బిజెపి నాయకులు మాజీ ముఖ్య మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులతో సాగుతున్న పనులకు రాష్ట్ర ప్రభుత్వం పేరు పెట్టి అధికారం ఎక్కడ కూడా లేదని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 650 కోట్ల నిధులతో కేంద్ర ప్రభుత్వం నేను ఉప్పల్ ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడిగరి చేతులు మీదుగా శంకుస్థాపన పనులను ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కారిడానికి సంబంధం లేని వ్యక్తుల పేర్లు పెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.