Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ భూమిని కాపాడండి

  • నెమ‌లిన‌గ‌ర్ లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి.
  • సీపీఎం నాయ‌కులు

ముద్ర గండిపేట్ : మణికొండ మున్సిపాలిటీ నెమలి నగర్ లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని జిల్లా కార్యదర్శ వర్గ సభ్యులు డీ జగదీష్, గండిపేట్ మండల కార్యదర్శి డి ప్రవీణ్ కుమార్ అన్నారు.బుధ‌వారం ఈ మేర‌కు గండిపేట్ మండల కార్యాల‌యం ఎదుట క‌మిటీ స‌భ్యుడు ఎం.అశోక్ అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా రెవెన్యూ ఆఫీసర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయని, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్, రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, రోడ్లు లేవ‌ని, బస్సు సౌకర్యం లేదన్నారు. 60 గజాల ఇండ్ల నుంచి హైవే రోడ్డుకు కొత్త రోడ్డు వేయాలని అన్నారు.సర్వే నంబర్ 290 లో 419 ఇండ్ల పట్టాలు ఇచ్చారన్నారు.గ‌తంలో బడాబాబులు భూ కబ్జా చేస్తున్నారన్నారు.వెంటనే అధికారులు చొరవ తీసుకుని కబ్జా అయిన భూమిని కాపాడాలని, అక్కడ ఇల్లు లేని పేదలకు 60 గజాల చొప్పున ఇవ్వాలని తహ‌శీల్దార్ కు చెప్పామ‌ని, వారు కలెక్టర్ తో మాట్లాడుతానని సమాధానం ఇచ్చారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు నాగేష్ గౌడ్, లక్ష్మణ్ కుమార్ గౌడ్,పార్టీ సభ్యులు రఘు, రామాంజనేయులు, మహేష్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.