Take a fresh look at your lifestyle.

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  • ఎమ్మెల్యే మల్ రెడ్డిని కలిసిన మధ్యాహ్న భోజన కార్మికులు

ముద్ర, ఇబ్రహీంపట్నం: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించి, సమస్యలు పరిష్కరించే విధంగా చొరవ చూపాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని సిఐటియు నాయకులు,మధ్యాహ్న భోజన కార్మికులు కోరారు.నగరంలోని ఆయన నివాసంలో సిఐటియు జిల్లా నాయకులు పోచమోని కృష్ణ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్నాలు కార్మికులతో కలిసి ఎమ్మెల్యేను బుధవారం కలిసి తమ సమస్యలను వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై చర్చ జరిపి వాటిని పరిష్కరించే విధంగా చొరవ చూపాలని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా మంత్రులతో చర్చిస్తామని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నవనీత,స్వరూప,మంజుల,స్వరూప,మంగమ్మ,అనిత,రాధ,బాలమణి,అనిత,అనసూయ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.