రామగిరి, ముద్ర: గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని రామగిరి బేగంపేటలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంథని సిఐ రాజు హెచ్చరిక.గ్రామాల్లో ఎవరైనా శాంతి భద్రతలకు ఆటంకం కల్పిస్తే 100(వంద)కు డయల్ చేయాలని సూచించారు.మొబైల్ ఫోన్ వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా ఫోన్‌లో మీ ఓటీపీలు లేదా ఎకౌంటు నంబర్ చెప్పాలంటే కాల్స్‌కు స్పందించవద్దు సైబర్ మాయదాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. బేగంపేటలో గంజాయి,మత్తు పదార్థాలు,గుడుంబా అమ్మినా,సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.ద్విచక్ర వాహనంపై డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని, వాహన సంబంధిత పత్రాలు లేకుంటే ఫైన్ వేసి వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.గ్రామాల్లో పోలీస్ నిరంతరం నిఘా ఉంచి పర్యవేక్షిస్తున్నామని సిఐ రాజు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ దివ్య కానిస్టేబుల్ శరత్ సిబ్బంది ఉన్నారు.