- తగుళ్ళ జనార్దన్ యాదవ్.
సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు, 2009-10 విద్యాహక్కు చట్టం గురించి ముఖ్యమంత్రితో మాట్లాడడానికి తిరుమలగిరిలో జరగబోయే సభకు ముందు విద్యార్థి సంఘాల నాయకులకు అవకాశం కల్పించాలని, సూర్యాపేట జిల్లా కేంద్రం 60 ఫీట్ల రోడ్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో తగుళ్ళ జనార్దన్ యాదవ్ జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడారు. గత 4 సంవత్సరాల నుండి దాదాపుగా 8 వెల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల కాక ప్రైవేటు కళాశాల యజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యాహక్కు చట్టాన్ని మన ప్రభుత్వం ఎందుకు రాష్ట్రంలో అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ యొక్క సమాచారాన్ని ఇంటలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేయాలని, మా విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడించాలని, మా సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేయొద్దని కోరుతున్నామన్నారు. రాష్ట్రాలు, గాని దేశాలు గాని అభివృద్ధి చెందాలంటే, ప్రధమంగా విద్యా వ్యాపారం కావద్దని, ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యా అందాలని, ఫీజు నియంత్రణ చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా పాలన అయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థి సంఘాలతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతే, రేపు జరగబోయే సభను అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. అదే సభలో బకాయిలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్లు విడుదల చేస్తున్నామని తెలియజేయాలి, లేనియెడల ఎమ్మెల్యేలు, మంత్రులను అడ్డుకుంటామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పెరుగు సరేష్, గణేష్, లింగస్వామి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.