- ఐక్యంగా ఉండి సూర్యాపేటలో భవన నిర్మాణం పూర్తి చేయాలి.
- పని చేసే వారిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.
- సూర్యాపేట పట్టణ పెఱిక సంఘం అధ్యక్షులుగా పత్తిపాక వేణుధర్.
- నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించిన కుల పెద్దలు, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ.
సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: పెఱిక కులస్తులంతా ఎక్కడా ఉన్నా కలసికట్టుగా ముందుకు సాగుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెఱిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణం పూర్తి చేసి మన ఐక్యతను చాటాలని తెలంగాణ రాష్ట్ర పెఱిక సంఘం అధ్యక్షులు మద్దా లింగయ్య అన్నారు. పెఱిక సంఘం సూర్యాపేట పట్టణ నూతన కార్యవర్గ గౌరవాధ్యక్షులుగా బంధు వీరయ్య, అధ్యక్షులుగా పత్తిపాక వేణుధర్, సహాయ అధ్యక్షులుగా యర్రంశెట్టి రామలింగయ్య, ప్రధాన కార్యదర్శిగా పోతరాజు నర్సయ్య, కోశాదికారిగా సోమిశెట్టి లింగయ్య, సంయుక్త కార్యదర్శిగా నట్టె కిరణ్, ప్రచార కార్యదర్శిగా దేవరగట్ల సతీష్ లు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఆదివారం స్థానిక ప్రతిష్ట బి ఫార్మసి కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట పట్టణ నూతన కార్యవర్గం ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ సీనియర్ల సలహాలతో ముందుకెళుతూ సంఘ పటిష్టతకు పాటుపడాలన్నారు. కుల ప్రముఖులు, సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, హైద్రాబాద్ పెఱిక హాస్టల్ మాజీ అధ్యక్షులు అంగిరేకుల నాగార్జున, ప్రతిష్ట బిఫార్మసి కళాశాల చైర్మన్ డాక్టర్ మిన్న శివరామక్రిష్టలు మాట్లాడుతూ అందరి సహకారంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెఱిక కులస్తుల ఆత్మగౌరవ భవనానికి భూమిని సాధించుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అందరికి ఆదర్శంగా భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భవన నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. కోకాపేట పెఱిక భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్ మాట్లాడుతూ సంఘం కోసం పని చేసే వారికి ఎలాంటి లాభాపేక్ష ఉండదని ఒక్కో సమయంలో తమ సొంత డబ్బులు పెట్టుకొని కూడా సంఘానికి సేవ చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. అలా పని చేసే వారిని విమర్శిస్తే ఊరుకునేది లేదని సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తూ విమర్శలు చేస్తే ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. రెండు రాష్ట్రాలకు వారధిగా ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి వెంట పెఱిక కుల ఆత్మగౌరవ భవనాన్ని యావత్ తెలంగాణాకు ఆదర్శంగా నిర్మించుకోవాలన్నారు. అందుకోసం ప్రత్యేకంగా కమిటీలు వేసుకొని అందరిని కలుపుకొని ముందుకు సాగితే భవన నిర్మాణం సకాలంలో పూర్తి అవుతుందన్నారు. అనంతరం నూతన కార్యవర్గంచే ప్రమాణస్వీకారం చేయించడంతో పాటు జాతీయ రహదారి వెంట ఉన్న పెఱిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. సూర్యాపేట పట్టణ సంఘం మాజీ అధ్యక్షులు బాల్తు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, పెఱిక విద్యార్థి వసతి గ్రుహ చైర్మన్ డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిది సుందరి విజయభాస్కర్, పీసీసీ మెంబర్ దొంగరి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ సభ్యులు సుంకరి అజయ్కుమార్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బందు శ్రీదర్, సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనపర్తి లక్ష్మినారాయణ, సముద్రాల రాంబాబు, కోదాడ పెఱిక హాస్టల్ మాజీ అధ్యక్షులు బొలిశెట్టి క్రిష్ణయ్య, మాజీ జడ్పీటీసీ కోట మల్లికార్జున్, హాస్టల్ మాజీ ఉపాధ్యక్షులు వలిశెట్టి సత్యనారాయణ, నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముత్తినేని శ్యాంసుందర్, వీరరాఘవులు, కోదాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వర్రావు, మాజీ కౌన్సిలర్ సుంకరి రమేష్, యర్రంశెట్టి ఉపేందర్, కోదాడ హాస్టల్ గౌరవాధ్యక్షులు పాయలి కోటేశ్వర్రావు, అధ్యక్షులు హసనాబాద రాజేష్, నల్లగొండ హాస్టల్ అధ్యక్ష, కార్యదర్శులు వలిశెట్టి హరి, సముద్రాల నారాయణ, మిర్యాలగూడెం సంఘం అధ్యక్షులు బొలిశెట్టి భిక్షపతి, బందు క్రిష్టయ్య, పిన్నెని మల్లికార్జున్, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు బొలిశెట్టి మదు, పట్టణ కోశాధికారి సుంకరి లింగమూర్తి, సంద్యాల వినోద్ తదితరులు ఉన్నారు.