Take a fresh look at your lifestyle.

పక్కగా భూ హక్కుల కోసం రీసర్వే అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్:
పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు.
మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజాం ప్రభుత్వం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య కష్టపడి పనిచేసి భూమి నక్షాను రూపొందించడం జరిగిందన్నారు. అప్పటినుంచి కొన్ని గ్రామాల్లో భూనక్షాల్లో సమస్యల తలెత్తాయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొంద పరుస్తామన్నారు. ఎలాంటి భూ వివాదాలు లేకుండా చేసి, భూమికి భూధార్ ను అందించడం జరుగుతుందన్నారు. భూమి ప్రతి రైతుకు ఒక సెంటిమెంట్ అని, భూమికోసం రైతులు పరితపిస్తూ ఉంటారన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు. జిల్లాలో 24 గ్రామాల్లో భూ రిసర్వేను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్తామన్నారు.
భూ రిసర్వే అనంతరం విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం పక్కగా వారి భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి, ల్యాండ్ సర్వే ఏడి కిషన్, డిపిఆర్ఓ రామచంద్ర రాజు, తహసిల్దార్ రజనీ, ఎంపీడీవో, గ్రామ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.