Take a fresh look at your lifestyle.

ఆడంబరమెరుగని ఆదర్శ నేత చండ్ర రాజేశ్వర రావు: వర్థంతి సభలో కమ్యూనిస్టు నేతలు

ముద్ర, శేరిలింగంపల్లి:
కమ్యూనిస్ట్ యోధుడు చండ్ర రాజేశ్వర్ రావు ఆడంబరమెరుగని ఆదర్శనేత అని కమ్యూనిస్టు నేతలు కొనియాడారు. చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ కొండాపూర్ సీఆర్ ఫౌండేషన్ లోని అయన విగ్రహానికి సీఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కె నారాయణ, అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వర రావు, ఉపాధ్యక్షులు అజీజ్ పాషా, జల్లి విల్సన్, ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్యెల్యే పల్లా వెంకట్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస రెడ్డి, ఫౌండేషన్ కార్యదర్శులు చెన్నమనేని వెంకటేశ్వర రావు, పి జే చంద్రశేఖర్ రావు, పిడికిటి సంధ్యాకుమారి ఉపాధ్యక్షులు కంభంపాటి అజయ్, కోశాధికారి వి.చెన్నకేశవ రావు, కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, చాడ వెంకట రెడ్డి, ఆరోగ్య కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె. రజిని, మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్ శ్రీమతి జోశ్యభట్ల కల్పన, సభ్యులు బివి విజయలక్ష్మి, శ్రీమతి కనపర్తి జ్యోస్న, వి.లలిత తదితరులు ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ నారాయణ మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తితోనే సిఆర్ ఫౌండేషన్ను నిర్వహించి అందులో వృద్ధాశ్రమాన్ని, ఎన్‌ఆర్‌ఆర్‌ రిసర్చ్ సెంటర్‌, మహిళా సంక్షేమ కేంద్రం, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో సిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్స్తున్నామని తెలిపారు. చండ్ర రాజేశ్వరరావు ఆశయాలను సాధించడం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం సలహా కమిటీ సభ్యులు వృద్ధాశ్రమ వాసులు, మహిళా సంక్షేమ కేంద్రం వృత్తివిద్యా కోర్సుల విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.