ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జెండా ఎగరవేశారు.ఆర్డీవో శ్రీను తమ కార్యాలయం వద్ద, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శివరాం, పుర కార్యాలయం వద్ద కమిషనర్ మహమూద్ షేక్, జెండాను ఎగరవేశారు. అంతకుముందు పాలమూరు కూడలి లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు అధికారులు పాల్గొన్నారు.