Take a fresh look at your lifestyle.

త్వరలో సిద్దిపేట తంజీమ్ సమస్య పరిష్కారం

 

* ఉద్దేశ్య పూర్వకంగా ఎవరు ఇబ్బంది పెట్టిన చట్ట రీత్యా చర్యలు
* తంజీమ్ కాంప్లెక్స్ లలో ఉన్న కిరాయిదారులు తమ కిరాయి ని తంజీమ్ హజ్ హౌస్ లో చెల్లించాలి
సిద్దిపేట తంజీమ్ సుప్రీం బాడీ సభ్యులు

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :

గత రెండేండ్లుగా సిద్దిపేట తంజీమ్ -ఉల్ -మసాజిద్ లో నెలకొన్న సమస్యలు త్వరలోనే చట్టానికి లోబడి పరిష్కారం అయ్యో విధంగా చర్యలు తీసుకుంటున్నామని తంజీమ్ -ఉల్ -మసాజిద్ కమిటీ సుప్రీం బాడీ ప్రెసిడెంట్ జుబెర్ హుస్సేన్, తంజీమ్ కమిటీ ప్రెసిడెంట్ జియావుద్దీన్ అసిఫ్ తెలిపారు. శనివారం వారు మీడియా తో మాట్లాడుతూ సిద్దిపేట తంజీమ్ -ఉల్ -మసాజిద్ సొసైటీ పాత రిజిస్ట్రేషన్ నెంబర్ 414/2010 పూర్తిగా రద్దు అయ్యిందన్నారు . దాని బదులుగా 284/2023 లో చేసిన సొసైటీ రిజిస్ట్రేషన్ అధికారికంగా అమలులో ఉందన్నారు. సిద్దిపేట కమిటీ లో ఉన్న సుప్రీం బాడీ మెంబెర్స్ అందరు తంజీమ్ లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తెలిపారూ. సిద్దిపేట తంజీమ్ కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ లలో కిరాయిదారులు తమ నెలవారీ కిరాయను సిద్దిపేట తంజీమ్ లో డిపాజిట్ చేయాలని కోరారు. సిద్దిపేట తంజీమ్ గుర్తింపు లేని వ్యక్తులు కాని, సంస్థ సభ్యులుకాని, కిరాయి వసూలు చేయడానికి వస్తే వారికి కిరాయి ఇవ్వకూడదన్నారు. ఈ విషయమై సిద్దిపేట కోర్టు ఆర్డర్ O,S నెంబర్ 395 అఫ్ 2024 ప్రకారం ఫయాజ్, మహమూద్లపై ఇంటీరిమ్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందని తెలిపారు. వారు కిరాయి వసూలు చేసే అధికారం లేదన్నారు. అధికారిక తంజీమ్ నుండి బాధ్యత గల వ్యక్తులకు మాత్రమే కిరాయి చేల్లించాలన్నారు.
2010 లో రిజిస్ట్రేషన్ అయిన తంజీమ్ కమిటీ లో ముఖ్య సుప్రీం బాడీ సభ్యులు చనిపోవడం వలన ఆ రిజిస్ట్రేషన్ కాన్సల్ చేసి 2023 లో చట్ట ప్రకారం చేసిన రిజిస్ట్రేషన్ ను అమలులోకి తెచ్చామన్నారు. ఇక సిద్దిపేట తంజీమ్ లో ఎలాంటి సమస్యలు లేవని పారదర్శక పాలనే ద్యేయంగా ముందడుగు వేస్తున్నామన్నారు. సిద్దిపేట ముస్లిం సమాజ శ్రేయస్సుకు తంజీమ్ నూతన ఒరవడికి నాంది పలుకనుందన్నారు. సిద్దిపేటముస్లిం సమాజం అంత సహకరించాలని పిలుపునిచ్చారు. సమావేశం లో సుప్రీం బాడీ సభ్యులు, తంజీమ్ ఉల్ మసాజిద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.