ముద్ర ప్రతినిధి, నిర్మల్: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రాణాంతకంగా మారటం సహజం. ఇలా కుటుంబ కలహాలతో ఆత్మహత్యా యత్నం చేసిన మహిళను పోలీసులు కాపాడారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఒక వివాహిత కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఆత్మహత్యకు నిర్ణయించింది. స్థానిక కంచరోని చెరువులోకి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్న విషయాన్ని అటుగా వెళ్తున్న కొంతమంది పోలీసులకు చేరవేశారు.
పట్టణ బ్లూ కోల్ట్స్ సిబ్బంది కానిస్టేబుళ్లు ఎన్. గణేష్, తిలక్ లు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. వివాహితను ఆత్మహత్య చేసుకోకుండ నివారించగలిగారు. ఆమెను వారి కుటుంబ సభ్యులకు అప్పగించి ఆమె కుటుంబీకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ ఉదంతంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల ప్రశంసించారు.