Take a fresh look at your lifestyle.

రీ టెండర్ నిర్వహించి సేవాలాల్ భవనాన్ని పూర్తి చేయాలి సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ననావత్ రాజు -ఆర్డిఓ, ఎమ్మెల్యే పీఏకు వినతిపత్రం అందజేత

 

ముద్ర, నారాయణపేట:

నారాయణపేట నియోజకవర్గం లో బంజారా గిరిజనుల అభ్యున్నతి కోసం గత ప్రభుత్వ హయాంలో రూ. 1 కోటి వ్యయంతో జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద సేవాలాల్ భవనం ఏర్పాటు కోసం నిధులు మంజూరు అయ్యాయని సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ననావత్ రాజు ఆధ్వర్యంలో సోమవారం ఆర్డిఓ, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు మాధవరెడ్డికి వేరువేరుగా వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ భవన నిర్మాణం కోసం 332 జీవో గతంలో విడుదలైందని సేవాలాల్ భవన నిర్మాణం కోసం రీటెండర్ నిర్వహించి సేవాలాల్ భవనం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో వల్య నాయక్, చంద్రశేఖర్, హరి, సమీర్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.