ముద్ర యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆండాల్ అమ్మ వారికి ఆలయ అర్చకులు ఘనంగా ఊంజల్ సేవను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి శ్రీసూక్త పారాయణం నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉప ప్రధానార్చకులు సురేంద్రాచార్యులు అర్చకులు, ప్రశాంత్ కుమారాచార్యులు, శ్రీకాంతాచార్యులు, అనిల్ కుమారాచార్యులు వేద పండితులు,ఎస్పీఎఫ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.