ముద్ర, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ అసెంబ్లీలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిక్కులేదని, కనీసం డిపాజిట్లు కూడా దక్కవని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదని అన్నారు. అలాగే కాంగ్రెస్ కు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం లేదన్నారు.
ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ నగర బీజేపీ కార్యాలయంలో సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం జరిగింది. దీనిలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌తో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. దేశాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈజీగా ఉంటుందన్నారు.