ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల అర్బన్ పార్కులో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. పార్కులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి పారెస్టు, రెవెన్యూ సిబ్బంది చేరుకున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ? ఎంత నష్టం సంభవించిందన్నది తెలియాల్సి వుంది.