ముద్ర ప్రతినిధి, భువనగిరి :
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీలు ఇరుదేశాల మధ్యన చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు – సుంకాలు వ్యవసాయ ఉత్పత్తుల పైన, పారిశ్రామికోత్పత్తుల పైన తీవ్రమైన ప్రభావం చూపనున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అన్నారు.
సోమవారం బీబీనగర్ బ్రాహ్మణపల్లి రోడ్డులో సిఐటియు ఆధ్వర్యంలో ట్రంప్, మోడీ ల రెండు తలకాయల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ మనం దేశం నుండి అమెరికాకు ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామికోత్పత్తుల పైన ఎక్కువ సుంకాలు వేస్తూ, అదే అమెరికా నుండి మన దేశానికి దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తుల పైన, పారిశ్రామిక ఉత్పత్తుల పైన సుంకాలు లేకుండా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లనున్నదని అన్నారు. అమెరికా నుండి ఆహార సరుకులైన పాలు, పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, చికెన్, బియ్యం, పాలపొడిలతో పాటు వ్యవసాయ ఉత్పత్తులైన పత్తి, పొగాకు, మిర్చి దిగుమతి చేసుకోవడం వల్ల భారతదేశంలోని రైతులు తీవ్రంగా నష్టపోనున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు ఉత్పత్తి చేసే సరుకులను కూడా అమెరికా నుండి దిగుమతి చేసుకోవడం వల్ల చిన్న పారిశ్రామికవేత్తలు దివాలా తీసి పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉన్నదని అన్నారు. వెంటనే భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు – సుంకాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొట్ట యాదమ్మ, నాయకులు ఓవల్దాసు సతీష్, గాడి శ్రీనివాస్, పురుషోత్తం, పాష, కుమార్, కీమా, అంజు, నోముల మల్లారెడ్డి, స్వామి, నాగరాజు, లోకదాస్ పవన్, గొలనుకొండ వెంకటేశం పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.