Take a fresh look at your lifestyle.

​ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ సమస్యలు పరిష్కరించాలని ఆల్విన్ కాలనీ డీసీకి వినతి

ముద్ర కూకట్‌పల్లి :
ముసాపేట్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పలువురు సభ్యులు ఆల్విన్ కాలనీ డిప్యూటీ కమిషనర్ ని కలిసి స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ బండ పరిధిలోని ప్రధాన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
​ఎల్లమ్మ బండలోని కొత్త వాటర్ ట్యాంక్ వద్ద రోడ్డు పనులు పూర్తై చాలా కాలం గడిచినా, పేరుకుపోయిన మట్టిని ఇంకా తొలగించలేదు. దీనివల్ల వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ఆ మట్టిని క్లియర్ చేయాలని కోరారు.
​వాటర్ ట్యాంక్ వద్ద సెక్యూరిటీ లేకపోవడంతో రాత్రి వేళల్లో గంజాయి ముఠాలకు అది అడ్డాగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, 24 గంటల వాచ్‌మెన్‌ను నియమించాలని విన్నవించారు.
​ఎల్లమ్మ బండ భారతీయ విద్యాలయ స్కూల్ వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్‌ను కొందరు వ్యక్తులు తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. హాల్ లోపల పార్టీ బ్యానర్లు కట్టడం, వాహనాలు పార్క్ చేయడంతో మిగతా 18 కాలనీల వాసులకు అది అందుబాటులో లేకుండా పోయిందని డీసీకి వివరించారు. వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించి, కమ్యూనిటీ హాల్ అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
​ఈ కార్యక్రమంలో బుల్లెట్ రవి ప్రభాకర్, రాకేష్, ధనరాజ్ తదితరులు పాల్గొని అధికారులకు వినతి పత్రం సమర్పించారు.

Leave A Reply

Your email address will not be published.