ముద్ర కూకట్‌పల్లి:
నియోజకవర్గంలోనీ వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలో హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ప్యానెల్ సభ్యులు సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గెలుపొందిన సభ్యులను అభినందించిన వెంకటేశ్వరరావు, వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ సమస్యల పరిష్కారానికి, ప్రజల సంక్షేమానికి నూతన కార్యవర్గం అంకితభావంతో పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మరియు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.