Take a fresh look at your lifestyle.

అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష – జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
2016 సంవత్సరంలో పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో నిందితుడికి కోర్టు పదేళ్ల కారాగార శిక్ష, 12వేల రూపాయల విధిస్తూ తీర్పునిచ్చిందని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఒక ప్రకటనలో తెలిపారు. పరిగి మండలం, బర్కత్‌పల్లి గ్రామానికి చెందిన సుక్కాని అంజయ్య (37) అనే వ్యక్తిపై 2016లో అత్యాచారం బెదిరింపులకు ఐపీసీ సెక్షన్లు 376, 506 సంబంధించి కేసు నెం 268/2016 నమోదైంది. ఈ కేసు విచారణ వికారాబాద్‌లోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో కొనసాగింది. పోలీసులు సమర్పించిన పక్కా సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి చౌదరి చంద్ర కిషోర్, నిందితుడు అంజయ్యను దోషిగా నిర్ధారిస్తూ 10 సంవత్సరాల జైలు శిక్ష, 12వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో విశేష కృషి చేసిన అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నాటి దర్యాప్తు అధికారులు వై. నాగేష్, పి. ప్రసాద్ (అప్పటి పరిగి సి‌ఐ ), ప్రస్తుత పరిగి సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్.హెచ్.ఓ మోహన్ కృష్ణలను, అలాగే కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన అడిషనల్ పి.పి. మెరాజ్ ఫిర్దౌస్, సి.డి.ఓ జగన్ మోహన్ రెడ్డి, కోర్టు లైజన్ ఆఫీసర్ ఎస్. నిరంజన్ గౌడ్ ల పనితీరును ఎస్పీ ప్రశంసించారు. మహిళల భద్రత విషయంలో జిల్లా పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, నేరస్థులు చట్టం నుండి తప్పించుకోలేరని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.