Take a fresh look at your lifestyle.

రైళ్లలో రక్షణ చర్యలు పటిష్టం

  • ఆకతాయిలపై కఠిన చర్యలు.
  • రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడిన 102 మందిని అరెస్ట్.
  • రైల్వే పట్టాలపై ప్రమాదకర వస్తువులు ఉంచినందుకు 33 మంది అరెస్టు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్.పి.ఎఫ్), దక్షిణ మధ్య రైల్వే రైళ్లపై రాళ్లు రువ్వడం, రైల్వే ట్రాక్‌లపై ప్రమాదకారక వస్తువులను ఉంచడం వంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిందిది.దీనివల్ల ప్రయాణికుల భద్రతకు భంగం కలుగుతుందని, రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లుతుందని వివరించింది. రైల్వే రక్షక దళం(ఆర్.పి.ఎఫ్) భవిష్యత్తులో ఇటువంటి సంఘ వ్యతిరేక సంఘటనలను నివారించడానికి, దక్షిణ మధ్య రైల్వే వ్యాప్తంగా అనేక చర్యలను తీసుకుంటోందని, ఈ ప్రయత్నాలలో భాగంగా, దక్షిణ మధ్య రైల్వేలో 2025 సంవత్సరంలో జనవరి నుండి మే వరకు, రైళ్ల పై 128 రాళ్ల దాడి కేసులు నమోదు చేశాయి. వీటిలో 85 కేసుల్లో 102 మంది నేరస్థులను అరెస్టు చేశారు.ఈ కేసులన్నీ సంబంధిత న్యాయస్థానాల్లో విచారణ జరిగాయి. ఇప్పటివరకు 12 మందిని దోషులుగా నిర్ధారించగా, అందులో ఒక నిందితుడికి 15 రోజుల జైలు శిక్ష పడింది. మిగిలిన 11 మంది నిందితులకు రూ. 30,500 జరిమానా విధించారు.రైల్వే పట్టాలపై ప్రమాదకారక వస్తువులను ఉంచిన 29 కేసులు నమోదు చేయగా, వీటిలో 26 కేసుల్లో 33 మంది నేరస్థులను అరెస్టు చేశారు.ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణకు రైల్వే అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు.ఇలాంటి విద్రోహ చర్యలను ఎదుర్కోవడంలో రైల్వేకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైల్వేకు అంతరాయం కల్గింఏ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి 139కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, తద్వారా త్వరితగతిన చర్యలు తీసుకోవచ్చని ఆయన సూచించారు.

Leave A Reply

Your email address will not be published.