ఖమ్మo, ముద్ర: ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ వద్ద ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో విషాదం నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని డేగల యోగానందిని(17) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం స్టడీ అవర్ కు హాజరైన ఆమె తిరిగి హాస్టల్ కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా ఎటపాకగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళాశాల తో పాటు హాస్టల్ కి వెళ్లి విషయం చేపట్టారు.