విద్యార్థిని విద్యార్థులకు జిల్లాస్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహణ. ..విద్యార్థులందరు భావి శాస్త్ర వేత్తలు గా ఎదగాలి. ..జిల్లా అడిషనల్ కలెక్టర్ పిలుపు. ..

ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీసే సదుద్దేశంతో, సైంటిఫిక్ టెంపర్ పెంచే సదుద్దేశ్యం తో ఫోరమ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు అమిరిశెట్టి దామోదర్, ప్రధాన కార్యదర్శి V.రాంకిరణ్ మరియుకార్యవర్గం ఆధ్వర్యంలో 16 మండలాల లోని అన్ని ప్రభుత్వ పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న మండల టాపర్స్ అయిన విద్యార్థిని విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ డిస్ట్రిక్ట్ సైన్స్ మ్యూజియం నందు నిర్వహించడం జరిగింది .ముఖ్య అతిథులుగా విచ్చేసిన కరీంనగర్ డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్ ) ,జిల్లా విద్యా శాఖ అధికారి ఆశ్విని తానాజీ వాకడె మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులందరు మంచి క్రమశిక్షణ తో, మంచి అలవాట్లతో తరగతి గది లో చదువుకొన్న అంశాలను నిజ జీవితం తో అనుసంధానం చేసుకోవాలని శాస్త్రీయ దృక్పతాన్ని పెంపొందించుకోవాలని, శాస్త్రవేత్త ల కృషిని స్ఫూర్తిగా తీస్కొని ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ నందు మంచి పట్టు సాధించి భావి శాస్త్ర వేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.విద్యార్థుల తో,ఉపాధ్యాయుల తో భౌతిక, రసాయన, జీవ శాస్త్రాల కి సంభందించి అనేక అంశాలను అడిగి సంతృప్తి వ్యక్తం చేసారు. జిల్లా సైన్స్ అధికారి చాడ జయపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు అందరూ డిస్ట్రిక్ట్ సైన్స్ మ్యూజియం సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నత పౌరులుగా ఎదగాలని ,సైన్స్ పట్ల ఆసక్తిని పెంపోందిచుకోవాలని ఆకాంక్షిస్తూ ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ కు సంభందించిన టాలెంట్ టెస్ట్ పేపర్ సీల్డ్ కవర్ ను ఆవిష్కరించారు. 16 మండలాల నుండి ఎంపిక కాబడినమొదటి,రెండవస్థానాలలో నిలిచిన విద్యార్థులకు మెమెంటో ల ప్రధానం చేసారు. కరీంనగర్ నుండి ప్రథమ స్థానం కనపర్తి సుశాంత్ (ZPHS జంగపల్లి ),ద్వితీయ స్థానం భూంపల్లి కీర్తి (ZPHS JANGAPALLI),మూడవ స్థానం కోమటిరెడ్డి ఆదిత్య (TGMS ఎలగందల్ ) ల కి మెమెంటో ప్రధానం చేసారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి నందు జరిగే టాలెంట్ టెస్ట్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈకార్యక్రమం లో ప్లానింగ్ కోఆర్డినేటర్ మిలకూరి శ్రీనివాస్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని వసుంధర ఫోరమ్ అఫ్ ఫిజికల్ సైన్స్ భాధ్యులు నాగుల భుజన్ చందర్, నలుమాచు చంద్ర శేఖర్,కామిరెడ్డి రామేశ్వర్ రెడ్డి గైడ్ టీచర్స్ గోరంటల ఆనందం, md.మునీరొద్దిన్, 32 పాఠశాల ల నుండి సంభంధిత గైడ్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.