Take a fresh look at your lifestyle.

నల్గొండ జిల్లాలో కుటుంబ పాలనకు ముగింపు పలకాలి

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : నల్లగొండ జిల్లాలో కుటుంబ పరిపాలనకు ముగింపు పలకాలంటే, బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా ఒక కుటుంబ పాలనలో ఉందని, ఈ జిల్లాను ఒక కుటుంబానికి చెందిన సోదరులు నడుపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశానికి ముఖద్వారం తెలంగాణ అవుతుందని, ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు. సోమవారం నల్గొండ, సూర్యపేట జిల్లాలో రామచంద్రరావు పర్యటించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్, చిట్యాల,నల్గొండ తదితర చోట్ల రామచంద్రరావుకు బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తులన స్వాగతం పలికారు. నల్గొండ పట్టణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రామచంద్ర రావు అనంతరం ఆలయం ప్రాంగణంలో చెట్టును నాటారు. అలాగే నల్గొండ పట్టణంలో నక్సలైట్ తూటాలకు బలైన గుండగోని మైసయ్య గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలోని బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్న రామచంద్ర రావు మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా తన జన్మభూమి ఇని, ఈ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలి పర్యటన చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దళారీ వ్యవస్థ ద్వారా రేషన్ పంపిణీ చేస్తే పేదలకు వాటి ప్రయోజనం అందదన్నారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే రేషన్ కార్డులు ఇస్తున్నట్లుగా కనిపిస్తుందని, నిజమైన నిరుపేదలకు కార్యులు దక్కడం లేదని అన్నారు. అసలైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు దక్కకపోతే బీజేపీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 హామీలతో పాటు అనేక వాగ్దానాలు చేసిందని ఆయన గుర్తు చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని దుయ్యబట్టారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదని, నిరుద్యోగులకు భృతి లేదని..ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వడం లేదని రామచంద్ర రావు మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దోచుకుందని, మిగిలినది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని ఆయన విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో బిజెపి క్రమంగా విస్తరిస్తోందన్నారు. ఇప్పడు భారతీయ జనతా పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో బీజేపీ ఓటు శాతం అత్యధికంగా పెరిగిందన్నారు. యావత్ తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, మరింత బలోపేతం అవుతుందని రామచంద్ర రావు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.