Take a fresh look at your lifestyle.

పోచమ్మ తల్లి ఆలయంలో పొట్టోళ్ల శ్యామ్ గౌడ్  ప్రత్యేక పూజలు

బీబీనగర్, ముద్ర విలేకరి: బీబీనగర్ మండలం రుద్రవెల్లి గ్రామంలో గురువారం శ్రీ పోచమ్మ తల్లి, శ్రీ ఈదమ్మ తల్లి దేవతల నూతన దేవాలయాల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు పొట్టొళ్ల శ్యామ్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో ఆలయ కమిటీ చైర్మన్ జల్కపల్లి అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ పాండాల రమేష్ గౌడ్, నారాయణ రెడ్డి, బాల్ రెడ్డి, వెంకటేష్, నవీన్, సుదర్శన్ రెడ్డి, రాములు, మైపాల్ రెడ్డి, వెంకటయ్య, బొట్టు శ్రీను, జానీ, రవి గౌడ్, దేశం విజయ్ లతో పాటు గ్రామస్థులు, రుద్రవెల్లి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.