Take a fresh look at your lifestyle.

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ప్రిన్సిపాల్ చేతుల మీదగా అందజేత

గాంధారి, ముద్ర: గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం గంగారాం తెలుగు లెక్చరర్ ఎన్.లక్ష్మణ్ చేతుల మీదుగా సోమవారం తెలుగు స్టడీ మెటీరియల్ అందజేసారు. విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ ద్వారా తెలుగులొ 99మార్కులు సాధించవచ్చని మెటీరియల్ ఉచితంగా అందజేసిన తెలుగు లెక్చరర్ లక్ష్మణ్ వెల్లడించారు.పేదతనమంటే కేవలం డబ్బుల లేమి మాత్రమే కాదు. అది ఒక్కోసారి అవకాశాల తక్కువతనాన్ని సూచిస్తుంది. అలాంటి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, నోట్స్, పనిపత్రాలు లేకపోవడం వల్ల వారు తాము ఆశించిన స్థాయిలో చదువుకోలేరు. అలాంటి సమయంలో ఈ రోజు మన తెలుగు లెక్చరర్ లక్ష్మణ్ నా చేతుల మీదగా మెటీరియల్ అందించబడటం ఒక ఆశకి చిరునామా లాంటిదని ప్రిన్సిపాల్ గంగారాం పేర్కొన్నారు.పుస్తకాలు ఇచ్చినవారిలో గొప్పదనం ఉంది. కానీ, పుస్తకాలు తీసుకుని వాటిని చదివి, విజయం సాధించే విద్యార్థులే నిజమైన విజేతలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జెట్టి విజయ్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.