Take a fresh look at your lifestyle.

దొడ్డు బియ్యంతో ప్రజలను మోసం చేసిన గత పాలకులు

  • సన్న బియ్యం ఇచ్చి పేద ప్రజల కడుపు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం.
  • తుంగతుర్తి గడ్డ నుండి 5 లక్షల పైగా పేద ప్రజలకు రేషన్ కార్డుల పంపిణీ.
  • దేవాదుల ద్వారా తుంగతుర్తి ప్రాంతానికి గోదావరి జల్లాలు రప్పించాలని ముఖ్యమంత్రిని కోరిన ఉత్తం.
  • తుంగతుర్తి ప్రాంత సమగ్ర అభివృద్ధి కి అహర్నిశలు కృషి చేస్తా.
  • రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి.

తుంగతుర్తి, ముద్ర: రాష్ట్రంలో గత పాలకులు పేద ప్రజానీకానికి దొడ్డు బియ్యం పంపిణీ చేసి కడుపునిండా అన్నం తినకుండా చేశారని ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లు పేద ప్రజలు కడుపునిండా అన్నం తినడానికి గాను సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. సోమవారం తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో జరిగిన ప్రజా పాలన సభలో ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొడ్డు బియ్యం ప్రజలు తినలేక కోళ్ల ఫారాలకు బీరు తయారీ కంపెనీలకు అమ్ముకున్నారని ప్రజలు కడుపునిండా తిండిలేక ఇబ్బందులు పడ్డారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టడంతో పేద ప్రజానీకం ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు కడుపునిండా అన్నం తింటున్నారని అన్నారు అంతే కాకుండా గత పది సంవత్సరాల కాలంగా కొత్త రేషన్ కార్డు అనేది లేని తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా నూతన రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనని అన్నారు అంతేకాకుండా పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించడానికి కూడా అవకాశం లేదని కానీ నేడు 26 లక్షల మందికి పేర్ల మార్పు అవకాశం కల్పించామని అన్నారు రాష్ట్రంలో 80 శాతం మందికి కడుపునిండా అన్నం పెట్టే పథకం సన్న బియ్యం పథకం అని అన్నారు దేవాదుల ద్వారా తుంగతుర్తి నియోజకవర్గం పాలకుర్తి స్టేషన్గన్పూర్ వరదన్నపేట నియోజకవర్గం రప్పించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభాముఖంగా ప్రకటన చేయాలని ఉత్తంకుమార్ రెడ్డి కోరారు నల్లగొండ జిల్లాలో మూసీ జిల్లాలు సంపూర్ణంగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు పునాది గాని కాలువ కేతిరెడ్డి ఆనకట్టలను పునర్నిర్మాణం చేయాలని కోరారు కాలేశ్వరం నిర్మించింది టిఆర్ఎస్ హయాంలోని కూలింది కూడా వారి హయాంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాలేశ్వరం లేకుండానే దేశంలోనే రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కిందని అన్నారు తుంగతుర్తి ప్రాంతం పోరాటాల గడ్డ అన్ని తాను తుంగతుర్తి నియోజకవర్గం తాటిపాముల గ్రామవాసినని తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సారధ్యంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని అన్నారు నల్లగొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ కిల్లా అని అన్నారు రాష్ట్రంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలంతా కాంగ్రెస్ వెంటే ఉన్నారని అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని అన్నారు తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేలు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం అనాదిగా వెనుకబాడుతనంలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు తిరుమలగిరిలో జరిగిన భారీ బహిరంగ సభలో రాష్ట్రానికి చెందిన మంత్రులు అట్లూరి లక్ష్మణ్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలువేముల వీరేశం బీర్ల అవిలయ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లతోపాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలలో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.