Take a fresh look at your lifestyle.

పథకం ప్రకారమే హత్యా ప్రయత్నం

  • ముగ్గురిపై కేసు నమోదు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని పథకం ప్రకారం ఓ వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచినట్లు పట్టణ ఎస్సై జీ.రాజశేఖర్ తెలిపారు. ఆయన తెలిసిన వివరాల ప్రకారం కొత్త తిమ్మాపూర్లో నివాసం ఉండే దుర్గం వెంకటేష్ అదే గ్రామానికి చెందిన కొమ్మ సంతోష్ మధ్య ట్రాక్టర్ల విషయంలో తరచూ గొడవలు జరిగాయన్నారు. అదే తరుణంలో ఆదివారం తన భార్యతో కలిసి సంతోష్ సమీపంలోని పోచమ్మ గుడికి వెళ్తున్న క్రమంలో అడ్డుకొని గొడవపడి చంపుతానని బెదిరించారు. అదే రోజు రాత్రి పది గంటలకు వెంకటేష్ సంతోష్ కు ఫోన్ చేసి ఇంటికి రావాలన్నారు. ఇంటికి వచ్చిన సంతోష్ పై తండ్రి దుర్గం రాయపోషం, తల్లి శారద దాడి చేయగా ఇంట్లో కత్తితో వెంకటేశ్ కడుపులో,వెనుక విపులో పొడవగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం సంతోష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. దాడికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.