Take a fresh look at your lifestyle.

సిద్దిపేట బార్ కౌన్సిల్ ఎన్నికలు.. * అధ్యక్షుడుగా రమేష్ బాబు ఘన విజయం.

 

 

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట : 

సిద్దిపేట బార్ కౌన్సిల్ ఎన్నికలు గురువారం సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్వర్యంలో జరిగాయి. సిద్దిపేట బార్ కౌన్సిల్ లో మొత్తం 205 మంది సభ్యులు ఉండగా, గురువారం జరిగిన ఎన్నికల్లో 203 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో రమేష్ బాబు కు 106 ఓట్లు, ప్రత్యర్థి అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు సి హెచ్ జనార్దన్ రెడ్డికి 96 ఓట్లు పోలయ్యాయి. రమేష్ బాబు 10 ఓట్ల మెజారిటీ తో ఘన విజయం సాధించారు. రమేష్ బాబు ప్యానెల్ సబ్యులు న్యాయవాదులు పిన్న రాములు, శివాజీ, జి రామకృష్ణ, మణి, వెంకన్న, మహేష్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.