ఇద్దరికీ చెరిసమానం రావడంతో డ్రాలో జ్ఞాన సుందర్ కు వరించిన అధ్యక్ష పదవి… .
తుంగతుర్తి…. ముద్ర….
మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో గురువారం జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠంగా సాగాయి అధ్యక్షుడిగా అన్నెపర్తి జ్ఞాన సుందర్, తాళ్లపల్లి సత్యనారాయణ ఇద్దరు బరిలో నిలవగా 16 ఓట్ల గాను ఇద్దరికీ సమానం రావడంతో డ్రా తీయగా అన్నెపర్తి జ్ఞానసుందర్ కు అధ్యక్ష పదవి వరించిందని ఎన్నికల అధికారి గా వ్యవహరించిన ఎస్కే.వజీర్ తెలిపారు. దీంతో జ్ఞాన సుందర్ నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జ్ఞాన సుందర్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని, కోర్టు నూతన భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని, న్యాయవాదులకు కావాల్సిన హెల్త్ కార్డులు, నూతన కోర్టు భవనంలో రూ.1లక్షతో లైబ్రరీ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారిని పలువురు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.