Take a fresh look at your lifestyle.

సర్దార్ సర్వాయి పాపన్నకు ఘనంగా నివాళులు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు కలెక్టరేట్ లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ పీడిత వర్గాల కొరకు పోరాటాలు చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, బిసి, మైనారిటీల సంక్షేమాధికారులు శ్రీనివాస్, మోహన్ సింగ్, డీఈవో భోజన్న, పలువురు కుల సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.