Take a fresh look at your lifestyle.

కొండారెడ్డి పల్లి గ్రామ అభివృద్ధి పనులు వేగవంతం

  • కొండా రెడ్డి పల్లెలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన.
  • నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.
  • ముఖ్యమంత్రి స్వగ్రామానికి పలు అభివృద్ధి పనులు వెంటనే జరగాలని అధికారులను ఆదేశించిన కె.వి.ఎన్ రెడ్డి.

ముద్ర విలేఖరి,అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలోనీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సంబంధిత శాఖల అధికారులతో రైతు కమిషన్ సభ్యులు కేవీ నరసింహారెడ్డి, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ల తో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, మాట్లాడుతూ కొండారెడ్డి పల్లి గ్రామంలోనీ రెండు వరుసల రహదారి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పాలశీతలీకరణ నూతన భవనం నిర్మాణ పనులు, గ్రామంలో ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించే పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో సి సి రోడ్ ల నిర్మాణం,అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను,రహదారి వెంబడి వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ ద్వారా గ్రామంలో త్రాగు నీటి సరఫరా కు చర్యలు తీసుకోవాలని, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ ల ఏర్పాటు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.నిర్దేశిత సమయంలో గ్రామంలోని అభివృద్ది పనులన్నింటినీ పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.అంతకుముందు కొండా రెడ్డి పల్లెలో రైతు కమిషన్ సభ్యులు కేవీ నరసింహారెడ్డి, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు.ఈ సమీక్షా సమావేశంలో ఆర్ డి వో శ్రీనివాసులు,గ్రామ ప్రత్యేక అధికారి విజయ్ కుమార్, ఆర్ అండ్ బి అధికారులు దేశ్యా నాయక్,నాగలక్ష్మి, విద్యుత్ అధికారులు పాల్ రాజు, మిషన్ భగీరథ అధికారులు సుధాకర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.