Take a fresh look at your lifestyle.

పశ్చిమ బెంగాల్ లో బిజెపి గెలుపు చారిత్రాత్మక విజయం బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

2026 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్,అస్సాం,పాండిచ్చేరి రాష్ట్రాల్లో బిజెపి చారిత్రాత్మక విజయం సాధించిందని సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ సంతోషం వ్యక్తం చేశారు.5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపి మంచి ఫలితాలు రాబట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సోమవారం పార్టీ నాయకులతో కలిసి పాత బస్టాండ్ వద్ద సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది అభివృద్ధి ఆధారిత రాజకీయాలకు,ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.కేరళం, తమిళనాడులో కూడా బిజెపి ఓటు శాతం పెంచుకొని సీట్లు గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ విజయాలు భయపెట్టే రాజకీయాల నుండి నమ్మకం,అభివృద్ధి వైపు మలుపు అన్నారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి మెజార్టీ సీట్లు గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బాసంగారి వెంకట్,గుండ్ల జనార్ధన్,కెమ్మసరం సంతోష్,చెంది సత్యనారాయణ,తాటికొండ శ్రీనివాస్,గందె సంతోష్,పవన్,మహేందర్,గణేష్,కరుణాకర్,యాదగిరి,వెంకట్రావు,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.