Take a fresh look at your lifestyle.

ప్రజావాణి దరఖాస్తులను జవాబుదారితో పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

 మహాదేవపూర్, ముద్ర:

ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పరిష్కార స్వభావం దరఖాస్తు దారునికి తెలియచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారానికి ప్రజలు అందచేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 70 దరఖాస్తులు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు 3 ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు వచ్చే సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి నాటికి పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
దరఖాస్తుల పరిష్కారంలో ఎటువంటి పర్యవేక్షణ లోపం ఉన్నా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.