Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలి

  • జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం మినీ కాన్ఫరెన్స్ హాలు నందు ఎం పి డి ఓ లు, పి డి హోసింగ్, ఏ ఇ లు, డి ఇ లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్ర స్థాయిలో చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధులు, ఎల్.ఆర్.ఎస్ అంశాలపై కలెక్టర్ సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, వార్డు ఆఫీసర్లు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా పై అంశాల అమలు, సాధించిన ప్రగతి గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో అలసత్వము వహించ రాదని, క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ, నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీలలో లబ్దిదారుల వివరాలను రెండు రోజుల్లోగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పోర్టల్ లో ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని, వారికి ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సుముఖంగా లేని లబ్దిదారుల నుండి లిఖిత పూర్వకంగా తీసుకోవాలని, వారి స్థానంలో అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు జాబితా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాలను పాటిస్తూ, అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడ పెండింగ్ ఉన్నవో, స్థానిక శాసనసభ్యులు, కమిటీ సభ్యుల తో మాట్లాడి పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు.
ఇందిరమ్మ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరు చొరవ చూపాలని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ, అన్ని నివాస ప్రాంతాలలో ఫాగింగ్ చేయించాలని అన్నారు. ఎక్కడ కూడా డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు వంటివి ప్రబలకుండా చూడాలని, ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం నిర్ణీత రుసుము చెల్లించిన దరఖాస్తుదారులకు సత్వరమే ప్రొసీడింగ్ పత్రాలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా లో 10,398 మంజూరు అయినవని, 5419 గ్రౌండింగ్ లెవల్ లో పూర్తి అయినవని తెలిపారు.సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి,డీఆర్డీఓ శ్రీనివాస్, పి డి హోసింగ్ కృష్ణయ్య, డి పి ఓ జయసుధ, అన్ని మండలాల ఎంపీ డి ఓ లు,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.