ముద్ర విలేకరి, గండిపేట్ : 2020-2024 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజిఐటి) విద్యార్థులు మంగళవారం జెఎన్‌టియుహెచ్ లో జరిగిన స్నాతకోత్సవ వేడుకలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతులమీదుగా ఐదు బంగారు పతకాలను అందుకున్నారు.బిటెక్ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో అన్ని అనుబంధ కళాశాలలలో ఉత్తమ అవుట్‌గోయింగ్ విద్యార్థిని- పన్నటి శ్రీజ, బి.టెక్. మెకానికల్ ఇంజినీరింగ్ (మెకాట్రానిక్స్) విభాగంలో అన్ని అనుబంధ కళాశాలలలో ఉత్తమ అవుట్‌గోయింగ్ విద్యార్థి గొట్టిపర్తి అభినయ్, బి.టెక్. మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్ విభాగంలో అన్ని అనుబంధ కళాశాలలలో ఉత్తమ అవుట్‌గోయింగ్ విద్యార్థిని మెడగం నిఖితా రెడ్డి, బి.టెక్. కంప్యూటర్ సైన్స్ & బిజినెస్ సిస్టమ్స్ విభాగంలో అన్ని అనుబంధ కళాశాలలలో ఉత్తమ అవుట్‌గోయింగ్ విద్యార్థిని కె సాయి భారతి, బి.టెక్. కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (డేటా సైన్స్) విభాగంలో అన్ని అనుబంధ కళాశాలలలో ఉత్తమ అవుట్‌గోయింగ్ విద్యార్థిని పి ఆయేషా ఖానంలు పథకాలను అందుకున్నారు. ఈ సందర్బంగా, మనేజ్మెంట్, ప్రిన్సిపాల్, వైస్- ప్రిన్సిపాల్ మరియు కళాశాల సిబ్బంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.