Take a fresh look at your lifestyle.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ఐజేయు లక్ష్యం

  • టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామ్ నారాయణ
  • జర్నలిస్టులు విలువలతో కూడిన జర్నలిజం అందించాలని విజ్ఞప్తి
  • ఓకే రోజు 100 మందికి పైగా జర్నలిస్టులకు సభ్యత్వ నమోదు

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే టీయూడబ్ల్యూజే (ఐజేయు) లక్ష్యమని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టే కోల రామ్ నారాయణ పేర్కొన్నారు.టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్ట్ యూనియన్ ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్, రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు, యూనియన్ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు సామినేని మురారి ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు మైస పాపారావు,ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్ లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా నగర కమిటీ అధ్యక్షుడు మైస పాపారావు అధ్యక్షతన జరిగిన సభలో రామ్ నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆరు దశాబ్దాలకు పైబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో,తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ ఐజేయు అనుబంధంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులతో పాటు ఇండ్ల స్థలాలు సాధించిన ఘనత యూనియన్ కు ఉందని ప్రస్తావించారు.రెండు దశాబ్దాలుగా ఖమ్మం నగరంలో,జిల్లాలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం కావడం లేదని, సమస్య పరిష్కారం కోసం యూనియన్ చిత్తశుద్ధితో పని చేస్తుందని పేర్కొన్నారు. జర్నలిస్టులు విలువలతో కూడిన జర్నలిజాన్ని సమాజానికి అందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.యూనియన్ కు జర్నలిస్టుల సంఖ్య ముఖ్యం కాదని, నాణ్యమైన, విలువలు కలిగిన జర్నలిస్టులు యూనియన్ కు అవసరం అన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, రాష్ట్రంలో పెద్ద ఎత్తున యూనియన్ కు సభ్యత్వం ఉందని పేర్కొన్నారు.పోరాటాలు,ఉద్యమాల ద్వారానే సమస్యల పరిష్కారం జరుగుతుందని, ఆ రీతిలో జిల్లా,నగర కమిటీలు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.ఖమ్మం నగరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఖమ్మం నగర కమిటీ బాధ్యులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో సభ్యత్వ నమోదు విజయవంతంగా పూర్తిచేయాలని రామ్ నారాయణ స్పష్టం చేశారు.రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్, రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు, సామినేని మురారి, జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మొయినిద్దీన్, జిల్లా కోశాధికారి నాగండ్ల శివ, ఎన్టీవీ బ్యూరో భూపాల్, శ్రీనివాస్, నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మైస పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్, జిల్లా వీడియో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు ఆలస్యం అప్పారావు, జిల్లా ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు కమటం శ్రీనివాస్ తదితరులు యూనియన్ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రసంగించారు.

  • ఒకేరోజు వందమందికి పైగా జర్నలిస్టులకు సభ్యత్వ నమోదు :

టి యు డబ్ల్యూ జే (ఐజేయూ) సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది.ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, బ్యూరోలు, స్టాఫ్ రిపోర్టర్లు, ఫోటో వీడియో జర్నలిస్టులు,సబ్ ఎడిటర్లు, డెస్క్ ఇన్చార్జులు, ఇతర మీడియా విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని యూనియన్ సభ్యత్వాన్ని అందుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే . రామ్ నారాయణ చేతుల మీదుగా అందరికీ సభ్యత్వాలు అందజేశారు.వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో ఒకే రోజు వంద మందికి పైగా జర్నలిస్టులు సభ్యత్వాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ కోశాధికారి పురుషోత్తం, సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ నాయకులు తాళ్లూరి మురళీకృష్ణ,కళ్యాణ్ చక్రవర్తి, పసుపు లేటి సత్యనారాయణ, రమేష్, జనార్ధనా చారి, వేణుగోపాలరావు, శ్రీనివాస్, బసవేశ్వర రావు, పోటు శ్రీనివాస్, శ్రీనివాసరావు, డెస్క్ జర్నలిస్టులు ప్రసాదరావు,నారాయణరావు,సందీప్ కుమార్,అచ్చిరెడ్డి, నవీన్,చంద్రశేఖర్,రాంబాబు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు తదితర జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.