Take a fresh look at your lifestyle.

ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 46 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 24,గ్రామీణాభివృద్ధి శాఖ 5 మున్సిపాలిటీ 4,హౌసింగ్ 2, సూపర్ డెంటెంట్ ఆఫ్ పోలీస్ 2 డివిజనల్ పంచాయతీ 2 సర్వే ల్యాండ్,జిల్లా సంక్షేమ , యస్ డి సి, ఈ ఈ ఇరిగేషన్, ఆర్ టి సి, విద్యా, రోడ్లు, భవనాలు శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సి.ఈ.ఓ శోభ రాణి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.