- జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్
ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పెంపొందించడంలో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించేందుకు తెలంగాణ విద్యాశాఖ ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో ఐదు రోజుల వృత్యంత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ప్రతి ఉపాధ్యాయుడు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఎంపిక చేసిన 160 మంది రిసోర్స్ పర్సన్ లకు కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ తరగతులను ఆయన సందర్శించి మాట్లాడారు.ఉపాధ్యాయులకు తెలుగు మౌఖిక భాషాభివృద్ధిపై గణితంలో చతుర్విధ ప్రక్రియలు సాధించడం కోసం, ప్రతి విద్యార్థి సొంతంగా చదవడం, రాయడం కోసం,స్కూల్ లీడర్షిప్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ పద్ధతిలో విద్యాబోధన మొదలగు అంశాల పైన వృత్యంతర శిక్షణ అందిస్తున్నామని జూన్ నుంచి ప్రారంభమయ్యే పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరింత అర్థవంతంగా బోధన చేసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అందరం కృషి చేయాలని కోరారు.ప్రైవేట్ బడుల్లో కన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య దొరుకుతుందని ఈసారి పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో అది నిరూపితమైందని అన్నారు . జిల్లా 23 స్థానం నుంచి 13వ స్థానం లో నిలవడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు.. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మండల విద్యాధికారి శంకర్ , జిల్లా రిసోర్స్ పర్సన్ లు రఘురాం, మణికంఠ రాజేందర్, నెహ్రూ ప్రసాద్, శోభన్ బాబు, రాజేందర్, కృష్ణ ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి లతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.