Take a fresh look at your lifestyle.

కస్తూర్బా, గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత

మల్యాల, ముద్ర విలేకరి: మండలంలోని తాటిపెల్లి కస్తూర్బా, గురుకుల పాఠశాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలోని విద్యార్థులు, సిబ్బంది హాజరు పట్టికను హాస్టల్ లో గల మెస్ వంటగది, స్టోర్ రూం లను పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాలలోని సమస్యలను, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి వారు భోజనం చేశారు. వర్షాకాలం విష జ్వరాలు ప్రబలకుండా సరైన శానిటేషన్ పాటించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. వారి వెంట తాసిల్దార్ వసంత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.