Take a fresh look at your lifestyle.

చేర్యాల డివిజన్ ఏర్పాటుపై సీపీఐ సభలో తీర్మానం

  • సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు అందె అశోక్.

ముద్ర, చేర్యాల : చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఐ సిద్దిపేట జిల్లా 4వ మహాసభలో సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని జిల్లా కమిటీ, నాయకత్వం ఆమోదించింది.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ చేర్యాల నియోజకవర్గంగా, తాలూక కేంద్రంగా ఉండేదని రోజు రోజుకు అస్తిత్వాన్ని కోల్పోయి నేడు వెలవెలబోయిందని, చేర్యాలకు పూర్వ వైవం తీసుకురావడం కోసం గత 10 సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటే ఏకైక లక్ష్యంగా అనేక ధర్నాలు, రాస్తారోకోలు, 32 రోజులపాటు నిరాహార దీక్షలు నిర్వహించినప్పటికీ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని డివిజన్ చేయకుండా ఆశాస్త్రీయంగా విడదీసి మూడు ముక్కలు చేసి ద్రోహం చేసిందన్నారు.నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నాటి టీపీసీసీ అధ్యక్షులు, నేటి ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికల సభలో ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే డివిజన్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం సీపీఐ పార్టీ భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.