- ప్రత్యేక పూజల్లో.. ఎంపీ ఈటెల రాజేందర్.
కుషాయిగూడ (నాగారం) , ముద్ర విలేఖరి: నాగారం నేతాజీ నగర్ సమీపంలో నూతనంగా నిర్మించిన వారాహి మాత దేవాలయంలో నవరాత్రి పూజా మహోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి.శుక్రవారం జరిగిన చివరి రోజు పూజల్లో.. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మహోత్సవాలను తిలకించారు. అనంతరం ఎంపీ ఈటెల రాజేందర్ ను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించి వారాహి మాత చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత పెంపొందుతుందన్నారు. వారాహి మాత అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రోత్సవాలతో వారాహి మాత నవరాత్రి పూజ కార్యక్రమాలను సంప్రదాయపద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, నాగరాజు, బైరెడ్డి మల్లారెడ్డి, మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీనివాస్ గౌడ్, మేడ్చల్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి, నాగారం మహిళా మోర్చా అధ్యక్షురాలు జ్యోతి పాండే, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.