- మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు.
- జగిత్యాల ట్రాఫిక్ ఎస్ ఐ మల్లేశం.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష పడినట్లు ట్రాఫిక్ ఎస్ ఐ మల్లేష్ తెలిపారు.జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేష్ తమ సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి గోవింద పల్లె చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. చత్తిస్ ఘడ్ కు చెందిన బసంత్ ఠాకూర్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ పట్టుబడగా, అతని పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ జి. కరుణాకర్ ఎదుట హాజరుపరుచగ అతనికి నాలుగు రోజులు జైలు శిక్ష విధించినట్లు ఎస్ ఐ తెలిపారు. ట్రాఫిక్ ఎస్.ఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదని, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన వారు ప్రమాదాలను ఎదుర్కొనడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు హాని కలిగించడం జరుగుతుందన్నారు.దీనిని తీవ్రంగా పరిగణిస్తూ అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.