- తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్రంలో 3 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తూ రేషన్ కార్డు పై బీద మధ్యతరగతి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ దేశంలో ఎక్కడా లేదాని ఇది ఒక చరిత్ర అని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు అన్నారు.జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో రూ.13.38 కోట్లతో 20వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ జగిత్యాల వ్యవసాయ ఆధారిత ప్రాంతమని. గోదాం ల నిర్మాణం అత్యంత ఆవశ్యకమని, ఏడాది కాలంలో గోదాంను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తాన్నారు. 5 నుండి 10 లక్షల టన్నుల గోదాం ల నిర్మాణం చేపట్టే కార్యక్రమం చేపట్టామని. ఇప్పటివరకు 2.5 లక్షల టన్నుల గోదాంలకు ప్రణాళిక సిద్ధం చేయటం జరిగిందన్నారు. ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ గోదాంల నిర్మాణంతో కూలీలకు ఉపాధి, రైతులకు అత్యంత ప్రయోజనంగా ఉంటుందని, మద్దతు ధర లేని పంటలకు ధర వచ్చే వరకు గోదాం లలో నిల్వ చేసుకోవచ్చు తర్వాత లాభం పొందవచ్చన్నారు. గత 10 ఏండ్ల లో 20వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మిస్తే, ఈ ఏడాదిలో 20వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మించబోతున్నామన్నారు. మరో 20 వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణం అవసరం ఉందని, జగిత్యాలకు రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉందని గోదాం అవసరం అన్నారు.గోదాంకు వచ్చే రహదారి విస్తరణ చేయాలని,వాహనాల రాకపోకలు గ్రామానికి ఇబ్బంది కాకుండా బైపాస్ రోడ్డు విస్తరణ చేపడతాం అని అన్నారు.లక్ష్మి పూర్ గ్రామంలో సీడ్ ప్రాసెస్ యూనిట్ నిర్మాణం పూర్తి అయింది అని, కొంత యంత్ర సామగ్రి కొరత ఉందని దానిని పూర్తి చేయాలని కార్పొరేషన్ చైర్మన్ ను ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో గిడ్డంగుల డిఇ శ్రీనివాస్, ఎమ్మార్వో శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం, నాయకులు నక్కల రవీందర్ రెడ్డి, సదాశివ రావు, గడ్డం నారాయణ రెడ్డి, చెరుకు జాన్, అంకం సతీష్, మహేశ్వర్ రావు, గిద్దె శంకర్, నారాయణ గౌడ్, బోనగిరినారాయణ తదితరులు పాల్గొన్నారు.