Take a fresh look at your lifestyle.

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి

 

ముద్ర. తుంగతుర్తి :

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సర్పంచ్ మేడ్డుల రమేష్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులు పాల్గొని మాట్లాడుతూ గ్రామంలో బాలకుల కోసం ఏర్పాటు చేసిన కమిటీలు సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని అన్నారు. బాల్య వివాహం చేయడం నేరమని ఎవరు కూడా బాల్య వివాహాలను ప్రోత్సహించ వద్దని అన్నారు. ఈ సందర్భంగా బాలల హక్కుల బాల కార్మికుల బాల్య వివాహాల అధికారుల బాధ్యతలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ పాండవుల మహేష్ ,ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వరూప రాణి , ఆర్ లక్ష్మీ నరసయ్య బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ ఎ.శోభా రాణి , ఉమామహేశ్వరి,గ్రామ సభ్యులు వెంకన్న అంగన్వాడి టీచర్స్, లక్మి బాయి,శారద, ప్రజా ప్రతినిదులు అధికారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొనారు.

Leave A Reply

Your email address will not be published.